క్రీస్తును గూర్చి మీకు ఏమి - తోచుచున్నది (kreestunu gurchi meeku yemi tochuchunnadi) - Telugu Christian Song Lyrics
క్రీస్తును గూర్చి మీకు ఏమి - తోచుచున్నది
క్రీస్తును గూర్చి మీకు ఏమి - తోచుచున్నది
పరుడని నరుడని పొరపడకండి - దేవుని కుమారుడు
ఈయన - దేవుని కుమారుడు
1. ఈయన నా ప్రియకుమారుడు - ఈయనయందే ఆనందము
తండ్రియె పలికెను తనయుని గూర్చి - మీకేమి తోచూచున్నది ||క్రీస్తును||
2. రక్షకుడనుచు అక్షయుని - చాటిరి దూతలు గొల్లలకు
ఈ శుభవార్తను వినియున్నట్టి - మీకేమి తోచూచున్నది ||క్రీస్తును||
3. నీవు సజీవుడవైన - నిజముగ దైవ కుమారుడవు
క్రీస్తువు నీవని పేతురు పలుకగ - మీకేమి తోచుచున్నది ||క్రీస్తును||
4. మర్మము లెరిగిన మహనీయా - మరుగై యుండకపోతివని
సమరయస్త్రీయే సాక్షమియ్యగ - మీకేమి తోచూచున్నది ||క్రీస్తును||
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి